స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణమని ఎన్టీఆర్ అభిమాన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజన్న అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.