వర్జీనియా: నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో, అవంతిక నక్షత్రం నిర్మిస్తున్న ‘ఆటాడిన పాట’ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ATA అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి టైటిల్‌ను లాంచ్ చేయగా, నిర్మాత నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభినవ్ గోమఠం, స్వాతి శర్మ జంటగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని CG వర్క్ చివరి ఘట్టం జరుగుతోంది.