నిర్మల్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా, జిల్లాలో జనరల్ కేటగిరీ కిందకు వచ్చే మున్సిపాలిటీల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ ఛైర్మన్ అభ్యర్థులుగా బీసీ కులస్తులనే ప్రకటించాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాసామాజిక న్యాయం ప్రకారం బీసీలకు ఛైర్మన్ పదవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.