వైసీపీ జిల్లా ఎంప్లాయిస్ & పెన్షనర్ల విభాగ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన చుక్క పైడిరాజు రెడ్డికి వైఎస్ఆర్ టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా కామరాజు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పైడిరాజు రెడ్డిని దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఏపీఎస్ఆర్టీసీ కార్యదర్శి ఎస్. అప్పారావు, హెచ్‌ఎస్‌ఎల్ రిటైర్డ్ ఐఎన్‌టీయూసీ నాయకులు ఎన్. అప్పలరాజు, రాడ్ బెండర్ వైఎస్ఆర్ టియుసి లీడర్ పి. అప్పారావు (భోగేష్), ఆటో వైఎస్ఆర్ టీసీ నాయకులు సురాడ దానయ్య (బాషా బాయ్) తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.