ఆదిలాబాద్ జిల్లా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి వరంగంటి పండరి ఆలియస్ సూర్యం సతీమణి జ్యోతక్క మరణించారు. కొన్ని రోజులుగా బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న జ్యోతక్క నిర్మల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని స్వగ్రామం బోథ్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు అంత్య క్రియలు నిర్వహించారు.