తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మహా జాతర సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, దేశం నలుమూలల నుంచి గిరిజనులు పాల్గొనే ఈ జాతరను సౌత్ కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించాలన్న లక్ష్యంతో నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనుల జాతరకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.