బ్లడ్ క్యాన్సర్ ను సరైన సమయంలో గుర్తిస్తే నయమవుతుందని యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆంకాలజీ వైద్య నిపుణులు డా.రోహిత్ రెడ్డి చెప్పారు. నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జోహ్రా నగర్ కాలనీ కి చెందిన అహ్మద్ బేగ్ (34) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ యశోద ఆసుపత్రిని సంప్రదించగా సరైన చికిత్స అందించి పూర్తిగా నయం చేయగలిగామని తెలిపారు..