శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తోంది. అయితే ఇటీవల సాగునీటిని విడతల వారిగా విడుదల చేసి ఆపివేయడంతో కాలువల్లో నీటి మట్టం తగ్గింది. ఈ నేపథ్యంలో కాలువల్లో అరుదైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని డీ–83 కెనాల్‌లో నీరు గణనీయంగా తగ్గిపోవడంతో సుమారు 300 గ్రాముల బరువున్న భారీ రొయ్య బయటపడింది. కాలువలో ఇంత పెద్ద రొయ్య కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు చేతిలోకి తీసుకుని పరిశీలించగా, మరికొందరు చూడటానికి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సాగునీరు నిలిచిపోయిన సమయంలో రొయ్యలు, పీతలు, చేపలు ఈ విధంగా బయటపడటం ఇదే తొలిసారి.