నిర్మల్ జిల్లాలో నూతనంగా నిర్మించిన సదర్ మటన్ బ్యారేజీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రిమోట్ స్విచ్ ద్వారా గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలి ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు సంప్రదాయం ప్రకారం గోదావరి తల్లికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బ్యారేజీతో జిల్లాలో సాగునీటి సదుపాయాలు మెరుగుపడనున్నాయని అధికారులు తెలిపారు.