నిర్మల్ జిల్లా: గాలిపటం మాంజా ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. దిలావర్పూర్ మండలానికి చెందిన ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా నసీరాబాద్ సమీపంలో గాలిపటం మాంజా మెడకు చుట్టుకుంది. వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. గొంతుకు గాయం కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. వేగంగా వెళ్లి ఉంటే ప్రాణాపాయం జరిగేదని స్థానికులు తెలిపారు.