సీఎం పర్యటనకు సహకరించిన వారికి ధన్యవాదాలు: కలెక్టర్
NEWS Jan 17,2026 12:33 pm
నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా సాగడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తోడ్పడిన మీడియా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, పోలీస్ యంత్రాంగం, సభకు హాజరైన ప్రజలను ఆయన అభినందించారు. సమన్వయంతోనే కార్యక్రమం సజావుగా జరిగిందని పేర్కొన్నారు.