నిర్మల్ జిల్లా: కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు 287 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 700 అడుగులు కాగా శనివారం ప్రాజెక్టులో 698.87 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 101 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎడమ కాలువకు 191, కుడి కాలువకు 16, మిషన్ భగీరథకు 9 మొత్తం కలిపి 287 క్యూసెక్కులను వదులుతున్నారు.