జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీల కోసం మేడిపల్లి, కథలాపురం మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మించాలని కోరుతూ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. యువ క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఈ స్టేడియాలు ఎంతో అవసరమని ఆయన మంత్రికి వివరించారు. ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించాలని కోరారు.