ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో మంచు విష్ణు ఆవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ 1ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పోటీలో పాల్గొనేవారు గరిష్ఠంగా 10 నిమిషాల నిడివి గల లఘు చిత్రాలను సమర్పించవచ్చని తెలిపారు. కథ చెప్పే విధానం, దర్శకత్వ ప్రతిభ ఆధారంగా విజేతను ఎంపిక చేస్తామని చెప్పారు. విజేతగా నిలిచిన దర్శకుడికి ₹10 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీసే అవకాశాన్ని కల్పిస్తామని మంచు విష్ణు చెప్పారు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకురావడమే ఈ పోటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.