కథలాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కస్తూరి నరేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. యువకుల కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి క్రీడల్లో పాల్గొనడం వల్ల మానసిక ఆనందం పెరుగుతుందని తెలిపారు. ముగ్గుల పోటీల్లో సంధ్యకు తొలి బహుమతి రూ.5016, తూర్పాటి సంజనకు రెండో బహుమతి రూ.3016 అందజేశారు. పాల్గొన్న మహిళలందరికీ సారీలను బహూకరించారు. క్రికెట్‌లో పాల్గొన్న యువకులకు కూడా బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎస్సై నవీన్ కుమార్ పాల్గొన్నారు.