నిర్మల్: భాగ్యనగర్ కాలనీలో ఉదయం విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మూడేళ్ళ బాలుడు అశ్విన్ గత శనివారం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం వారం రోజులుగా పోలీసులు, కుటుంబ సభ్యులు విస్తృతంగా గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఉదయం ఇంటి సమీపంలోని ఓ కందకంలో అశ్విన్ శవమై కనిపించాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా, కాలనీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.