మధుమేహం, ఊబకాయం సమస్యలతో బాధపడేవారికి శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. సాధారణ చక్కెరలాగే తీపి రుచి ఉండి, రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను పెంచని ఒక సహజ చక్కెరను సులభంగా తయారు చేసే పద్ధతిని కనుగొన్నారు. ‘టాగటోజ్’గా పిలిచే ఈ చక్కెర.. పండ్లు, పాల ఉత్పత్తుల్లో స్వల్పంగా లభిస్తుంది. రుచి పరంగా చక్కరకు దాదాపు 90% సమానంగా ఉండగా, కేలరీలు మాత్రం కేవలం 40% మాత్రమే. దీన్ని తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. దీంతో టాగటోజ్ ఆరోగ్యకరమైన చక్కెర ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. భవిష్యత్తులో స్వీట్లు, శీతల పానీయాల్లో వినియోగానికి అవకాశం ఉంది.