ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కు వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు ఎత్తేయాలి: ఎమ్మెల్యే
NEWS Jan 17,2026 09:52 am
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామస్తులు 147 రోజులపాటు ఉద్యమం నిర్వహించారు. ప్రజల ఆందోళనకు స్పందించిన ప్రభుత్వం ఫ్యాక్టరీ ఏర్పాటును తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఉద్యమంలో పాల్గొన్న 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిర్మల్ ముఖ్యమంత్రి సభలోనూ ఈ అంశాన్ని తీసుకెళ్లి కేసుల ఉపసంహరణకు విజ్ఞప్తి చేశారు.