మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా పుణె, నాగ్‌పూర్, సోలాపూర్, నాసిక్ వంటి కీలక నగరాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి సత్తా చాటింది. 165 స్థానాలున్న పుణే కార్పొరేషన్‌లో బీజేపీ ఏకంగా 123 సీట్లు గెలుచుకోగా, 151 సీట్లున్న నాగ్‌పూర్‌లో 102 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. షోలాపూర్‌లోని 102 సీట్లకు గానూ 87 చోట్ల, నాసిక్‌లో 122 సీట్లకు 72 చోట్ల గెలిచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.