మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలో నివసించే అర్జున్ (27) అనే వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందినట్లు మల్యాల ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు. రాయికల్ కు చెందిన అర్జున్ కొండగట్టులో కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే డిసెంబర్ 31న మద్యం సేవించిన అర్జున్ నడుచుకుంటూ వెళ్తూ తన ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్తంభాన్ని మద్యం మత్తులో ఢీకొన్నాడు. దీంతో అతని బంధువులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.