ఏకంగా 42 మందిపై అనసూయ కేసు
NEWS Jan 16,2026 11:34 pm
యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న లైంగిక దూషణలు, అశ్లీల వ్యాఖ్యలు, బెదింపులు, వ్యక్తిత్వ హననంపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వేధింపులు తీవ్రతరం కావడంతో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు 22 పేజీల FIR నమోదు చేసి మొత్తం 42 మందిపై కేసులు పెట్టినట్లు సమాచారం. నిందితుల్లో ప్రముఖులు, అడ్వకేట్లు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. AIతో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.