‘మన శంకర వరప్రసాద్ గారు’ హిట్ తో చిరంజీవి దర్శకుడికి ‘మెగా ఆఫర్’ ఇచ్చారు. వెంకటేష్ తో కలిసి సినిమా చేయడానికి సిద్ధమని, ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న కథ సిద్ధం చేయాలని అనిల్ రావిపూడిని కోరారు. వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్టే. ఇప్పటికే హిట్‌తో జోష్‌లో ఉన్న అనిల్, ఇద్దరు దిగ్గజాల కోసం ఎలాంటి కథ తెస్తారన్నదే హాట్ టాపిక్.