నిర్మల్ మున్సిపాలిటీలో మహిళ ఓటర్లే ఎక్కువ
NEWS Jan 16,2026 11:22 pm
నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 98,204 ఓటర్లలో 50,824 మంది మహిళా ఓటర్లు ఉండగా, పురుషులు 47,362 మంది మాత్రమే ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు. మహిళల ఓట్లు ఎన్నికల ఫలితాలను నిర్ణయించగల కీలక శక్తిగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు మహిళల సంక్షేమం, హక్కులు, అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు.