నిర్మల్ జిల్లా మామడ మండలం పోన్కల్ గ్రామంలోని గోదావరి నదిపై రూ. 576 కోట్లతో నిర్మించిన సదర్మట్ బ్యారేజ్‌ను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బ్యారేజ్‌కు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిమోట్ ద్వారా గేట్లను ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు