అదిలాబాద్ జిల్లా పోరాటాలకు, పౌరుషానికి గడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్మల్ ప్రజలు ఇచ్చిన భరోసా, మద్దతు వల్లే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిర్మల్‌కే వచ్చానని, ఉమ్మడి జిల్లా ఇంద్రావెల్లిలోనే తొలి బహిరంగ సభ నిర్వహించామని చెప్పారు. జల్, జంగల్, జమీన్ కోసం కుమురంభీం పోరాడిన నేల ఇదేనని గుర్తు చేశారు.