కేసీఆర్ పాలనలో ఆదిలాబాద్ జిల్లా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో పదేళ్ల పాలనలో కేసీఆర్ అభివృద్ధి చేయాలనుకుంటే సాధ్యమయ్యేదని అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విద్యా, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని, తమ ప్రభుత్వం సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టిందని తెలిపారు.