GHMC లో బీసీలకు 40% స్థానాలు
NEWS Jan 16,2026 03:34 pm
GHMC పరిధిలోని 300 డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్ చేసింది. 2011 జనాభా లెక్కలు, BC డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. BCలకు 122 స్థానాలు కేటాయించారు. పురుషులు, మహిళలకు సమానంగా చెరో 61 సీట్లు ఇచ్చారు. SC లకు 23 (M-12, F-11), STలకు 5 (M-3, F-2) స్థానాలు కేటాయించారు. జనరల్ మహిళలకు 76, అన్రిజర్వుడ్ 74 స్థానాలు ప్రకటించారు. మొత్తంగా మహిళలకు 150 స్థానాలు దక్కాయి.