సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ఏడాది పతంగులు ఎక్కువగా అమ్ముడుపోయాయని అమ్మకందారులు చెప్పారు. ఈ మేరకు లక్ష్మీ దేవి పల్లి మండలంలోని ప్రతి పల్లెల్లో ప్రతిచోట గాలిపటాల ఆటలే దృశ్యం ఇచ్చాయి. సంక్రాంతి పండుగ వేళ నింగిలో ఇంద్రధనస్సులా పతంగులు ఆటను యువత సాగించారు. గతంలో ఎన్నడు లేని విధంగా పల్లెలో గాలిపటాలు ఎగురవేస్తూ పోటీ పడ్డారు. అయితే ఈసారి పోలీస్ అధికారుల సూచనలతో చైనామంజా వాడకం తగ్గింది.