నిర్మల్ జిల్లా: టికెట్ ఎవరికీ కేటాయించిన అందరూ కలిసి కట్టుగా పని చేయాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ ల్లో కౌన్సిలర్ టికెట్ ఆశిస్తున్న ఆశవాహులతో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. బొజ్జు పటేల్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. టికెట్ దక్కని వారికి పార్టీ ఇతర అవకాశాలు కల్పిస్తుందన్నారు.