నిర్మల్ జిల్లా: కుంటాల గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆద్వర్యంలో సంక్రాంతి ఉత్సవాన్ని నిర్వహించారు. జిల్లా ప్రచార ప్రముఖ్ వంగల సుధాకర్, జిల్లా గోసేవ ప్రముఖ్ కొత్తకాపు నారాయణ మాట్లాడుతూ.. ఐక్యత, కృతజ్ఞత, క్రమశిక్షణ, సేవాభావంలను గుర్తు చేసే మహా పర్వదినమన్నారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ఈ పవిత్ర సందర్భం మన జీవితాల్లో కూడా సకారాత్మక మార్పు రావాలని సూచిస్తుందన్నారు.