నిర్మల్ జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు కోరారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి సీఎం జిల్లాలో శుక్రవారం పర్యటిస్తున్నారని చెప్పారు. మధ్యాహ్నం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, పట్టణంలోని 42 వార్డులలో నుండి ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.