జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రుక్మిణి విఠలేశ్వరుల కళ్యాణం, గోదారంగనాథుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో కూడిన కుడారై ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ వేడుకలు కన్నుల పండువగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.