చింతల్‌పేట్‌లో గొర్రెలకు, మేకలకు
పోచమ్మ వ్యాధి నివారణ టీకాలు
NEWS Jan 13,2026 12:30 pm
చింతల్‌పేట్ గ్రామంలో పశువైద్య, పశుసంవర్థక శాఖ అధ్వర్యంలో గొర్రెలకు, మేకలకు పోచమ్మ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ తొట్ల చిన్నయ్య ప్రారంభించారు. 3 నెలల వయస్సు దాటిన అన్ని జీవాలకు టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ కొమ్మెర మనీషా పటేల్ సూచించారు. ఉపసర్పంచ్ లింగారెడ్డి, పశువైద్య సహాయక సిబ్బంది రమాదేవి, ఆఫీస్ సబర్డినేట్ చిరంజన్, మోహన్, యాదవులు పాల్గొన్నారు.