ఘనంగా స్వామి వివేకానంద జయంతి
NEWS Jan 13,2026 12:32 pm
నిర్మల్ జిల్లాలో హిందూ వాహిని నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో 163వ స్వామి వివేకానంద జయంతి, హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక వివేకానంద చౌక్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుని స్పూర్తితో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన ఆలోచనలతో స్థాపితమైన హిందూ వాహిని సంస్థలో చేరి, దేశ రక్షణతో పాటు ధర్మ రక్షణలో యువత ముందుండాలని అన్నారు. హిందూ వాహిని నగర సభ్యులు మనోజ్, బద్రి సాయి, మరిపెద్ది మహేష్, సాయి దేశ్‌పాండే, చరణ్, సుధాకర్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.