యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి
NEWS Jan 13,2026 12:34 pm
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా ప్రజలకు యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని వివేకానంద చౌక్‌లోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి ఆలోచనలు, ఆదర్శాలను అనుసరిస్తూ నేటి యువత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, దేశాభివృద్ధికి వివేకానందుని మార్గదర్శకత్వం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.