BRS పిలుపుమేరకు ఆదిలాబాద్ బంద్
NEWS Jan 06,2026 03:57 pm
జిల్లాలోని సోయాబీన్ రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ బంద్‌కు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. ఉదయం 4 గంటల నుంచే బస్సు డిపో ఎదుట ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు బస్సులను అడ్డుకోవడంతో డిపోలోనే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జోగు రామన్న మాట్లాడుతూ, సోయాబీన్ కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల మనోభావాలతో చెలగాటమాడుతున్నాయని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.