IPL 2026 ప్రసారాలపై బంగ్లాదేశ్ నిషేధం
NEWS Jan 05,2026 03:44 pm
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ప్రసారాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయించడమే ఇందుకు కారణమని తెలిపింది. సరైన కారణాలు చెప్పకుండా తీసుకున్న ఈ నిర్ణయం తమను బాధించిందని పేర్కొంటూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు, కార్యక్రమాల ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.