విద్యార్థులకు DNR ట్రస్ట్ విద్యా కానుక
NEWS Jan 05,2026 07:55 am
ములుగు: విద్యార్థులు AIని సద్వినియోగం చేసు కుని గ్లోబల్ సిటిజన్లుగా ఎదగాలని AI పుస్తకాల రచయిత ముద్దం నరసింహస్వామి పిలుపుని చ్చారు. అబ్బాపురం జెడ్పీ హైస్కూల్‌ను DNR ట్రస్ట్ అధినేత దొడ్డ ప్రతాపరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. DNR ట్రస్ట్ ద్వారా గణితం వర్క్ బుక్స్, ‘AI ఫర్ యంగ్ మైండ్స్’ పుస్తకాలు, టెన్త్ స్టడీ మెటీరియల్ అందిస్తున్నట్లు ప్రతాపరెడ్డి తెలిపారు. HM హనుమాన్, టీచర్స్ కందాల రామయ్య, సురేందర్, ప్రభావతి, శిలామణి పాల్గొన్నారు.