2026 క్యాలెండర్ ఆవిష్కరణ
NEWS Dec 28,2025 11:59 pm
కథలాపూర్ (మం) కేంద్రంలోని అంజనా టూర్స్ అండ్ ట్రావెల్స్ 2026 క్యాలెండర్‌ను రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—ప్రయాణాలను గమ్యానికి చేర్చడంలో టూర్స్ & ట్రావెల్స్ సేవలు కీలకమని, అంజనా టూర్స్ & ట్రావెల్స్ మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, కంటే సత్యనారాయణ, కిషోర్, నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.