సర్పంచ్‌గా చిట్యాల లక్ష్మణ్ ప్రమాణం
NEWS Dec 22,2025 10:06 am
మల్లాపూర్ మేజర్ గ్రామపంచాయతీలో ఏడేళ్ల తర్వాత కొత్త పాలకవర్గం కొలువుదీరింది. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వార్డు సభ్యులు ఎంపీడీవో అడ్వాల శ్రీకాంత్‌తో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరిం చారు. నూతన పాలకవర్గం సమన్వయంతో పనిచేసి గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.