బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్..!
NEWS Dec 22,2025 01:44 pm
BSNL కేవలం ఒక్క రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ అందించే సరికొత్త ‘ఫ్రీడమ్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు నిత్యం 2GB హై-స్పీడ్ డేటా, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలు లభిస్తాయి. తన 4G నెట్‌వర్క్ సామర్థ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా BSNL ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రధానంగా కొత్త సిమ్ తీసుకునే వారికి, ఇతర నెట్‌వర్క్‌ల నుండి బీఎస్ఎన్ఎల్‌కు మారే (MNP) కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుంది.