కేసీఆర్‌కు రేవంత్ సవాల్
NEWS Dec 21,2025 10:46 pm
మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఫేస్‌టు ఫేస్ చర్చకు సవాల్ విసిరారు. కృష్ణా, గోదావరి నది జలాలపై ఒకరోజు చొప్పున చర్చిద్దామని, కేసీఆర్ వస్తానంటే జనవరి 2న అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నీటి వాటాల విషయంలో కేసీఆర్ హయాంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టారని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదన్నారు. నీటి వాటాలపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలంటూ కేసీఆర్‌ను ఆహ్వానించారు.