రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం'
NEWS Dec 21,2025 10:32 pm
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తేనీటి విందుకు తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్, సీఎం రేవంత్ సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు. డిసెంబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించారు. తన పర్యటన ముగింపులో భాగంగా రాష్ట్ర ప్రముఖులకు ఈ విందును ఏర్పాటు చేశారు.