బిజెపిలో చేరిన సర్పంచ్ రమేష్ గౌడ్
NEWS Dec 21,2025 10:29 pm
నూతనంగా ఎన్నికైన కథలాపూర్ మండలం దుంపేట గ్రామ సర్పంచ్ మల్యాల రమేష్, ఉపసర్పంచ్‌లు కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు. మల్యాల రమేష్ మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి విధానాలపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. బీజేపీ కథలాపూర్ మండల శాఖ అధ్యక్షుడు మల్యాల మారుతి, కోడిపెల్లి గోపాల్ రెడ్డి, గాంధారి శ్రీనివాస్, రాచమడుగు వెంకటేశ్వర్రావు, రవీందర్ రెడ్డి, మల్లయ్య, దండిక లింగం, చెన్నవనేని రాజేందర్, నూకల అజయ్ తదితరులు పాల్గొన్నారు.