లోక్ అదాలత్‌లో 342 కేసుల పరిష్కరం
NEWS Dec 21,2025 10:27 pm
లోక్ అదాలత్లో మొత్తం 342 కేసులను రాజీ ద్వారా పరిష్కరించినట్లు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ తెలిపారు. సీనియర్ సివిల్ కోర్టులో 12, జూనియర్ సివిల్ కోర్టులో 273, కోరుట్ల జూనియర్ సివిల్ కోర్టుకు సంబంధించిన 57 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. ఆదివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో పులి దివాకర్–పులి త్రివేణి (HMPO నెం.73/2025), నాగుల గణేష్–నాగుల కీర్తన (సీసీ నెం.156/2024) దంపతులను న్యాయమూర్తులు స్వయంగా కౌన్సిలింగ్ చేసి, మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి కలిపారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన న్యాయం సాధ్యమవుతుందని న్యాయమూర్తులు తెలిపారు.