2026లో గోల్డ్ రేట్ పెరుతుందా?
NEWS Dec 20,2025 10:45 pm
ప్రముఖ ఆర్థిక సంస్థ Goldman Sachs విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2026లో బంగారం ధరలు మరింత పెరుగుతాయని 70% మంది పెట్టుబడిదారుల అంచనా. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేయడం, భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పారు. పసిడి ధరలు ఇప్పటికే భారీగా పెరగగా, భారత మార్కెట్‌లోనూ బంగారం రికార్డు స్థాయికి చేరింది. ద్రవ్యోల్బణ భయాల మధ్య బంగారం సురక్షిత పెట్టుబడిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.