నవదంపతులు అనుమానాస్పద మృతి
NEWS Dec 20,2025 10:41 pm
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న నవదంపతులు కోరాడ సింహాచలం (25), భవాని (19) వంగపల్లి స్టేషన్ దాటిన తర్వాత రైలు డోర్ వద్ద నుంచి జారిపడి మృతి చెందారు. రెండు నెలల క్రితమే వీరి వివాహం జరిగింది. ఘటనకు ముందు రైలులో వీరి మధ్య ఘర్షణ జరిగిన వీడియోలు వెలుగుచూడటంతో ఇది ప్రమాదమా లేక ఆత్మహత్యనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.