భారీ ఏసు విగ్రహానికి కోర్టు బ్రేక్
NEWS Dec 20,2025 10:24 pm
కర్ణాటక: కనకపురలో అత్యంత ఎత్తయిన 114 అడుగుల ఏసుక్రీస్తు విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 10 ఎకరాల భూమి కేటాయింపు పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని తానే చెల్లించానని తెలిపారు. అయితే భూ కేటాయింపుపై అభ్యంతరాలతో బీజేపీ, హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. దీనిపై కేసు నమోదుకాగా కర్ణాటక హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం విగ్రహ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అన్ని మతాల పట్ల తనకు గౌరవం ఉందని శివకుమార్ చెప్పారు.