సర్పంచ్ మల్లేష్ యాదవ్‌కు ఘన సత్కారం
NEWS Dec 20,2025 03:11 pm
పెద్దపల్లి మండలంలోని కాపులపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన మ్యాదరవేణి మల్లేష్ యాదవ్‌ను కాపులపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ కాపులపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని మల్లేష్ యాదవ్‌ను కోరారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వార్డు సభ్యులు కొమురయ్య, కుమారస్వామి, యాదవ సంఘం నాయకులు సింగరపు పోచమల్లు, గట్టయ్య, పాపన్న, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.