తెలుగుజాతి కోసం ఒక్కటయ్యాం: పవన్
NEWS Dec 20,2025 12:56 pm
పెరవలి: తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం.. విభిన్న పార్టీల భావజాలం నుంచి వచ్చి తాము ఒక్కటయ్యామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తూ.గోదావరి జిల్లా పెరవలి పర్యటనలో భాగంగా ‘అమరజీవి జలధార’ పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ.. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 5 జిల్లాల పరిధిలో రూ.7,190 ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది తమ లక్ష్యమన్నారు.